English   

బ్రేకప్ తోనే సౌత్ సినిమాలకు దూరమయ్యా..మోనాల్

Monal
2020-12-16 12:18:52

బిగ్ బాస్ తెలుగు సీజన్-4 లో తన అందంతో కుర్రాళ్ళ మనసుదోచుకున్న బ్యూటీ మోనాల్ గజ్జర్. 14వారాల పాటు మోనాల్ హౌస్ లో ఉండి ఆదివారం భయటకు వచ్చింది. ఇక మిగతా బిగ్ బాస్ హౌస్ మేట్స్ లాగానే మోనాల్ కూడా భయటకు రాగానే పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ లు ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మోనాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూ లో మోనాల్ సౌత్ ఇండస్ట్రీకి దూరమవ్వడంపై స్పందించింది. 

మోనాల్ మాట్లాడుతూ..."సౌత్ లో సినిమాలు చేస్తున్న సమయంలో ఓ మలయాళ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్న క్రమంలోనే ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తరవాత కొద్ది రోజులు రిలేషన్ షిప్ లో ఉన్నాము. కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోవాల్సివచ్చింది. నేను ప్రేమించిన అబ్బాయి మలయాలి అందుకే మళ్ళీ సౌత్ లో సినిమాలు చేయవద్దని డిసైడ్ అయ్యాను. అప్పటి నుండి అన్ని గుజరాతీ సినిమాల్లోనే నటించాను." అంటూ చెప్పుకొచ్చింది. ఇక యాంకర్ మళ్ళీ తెలుగులో ఆఫర్స్ వస్తే ఒప్పుకుంటారా అని అడగ్గా మోనాల్ తప్పకుండా చేస్తానంటూ సమాధానం ఇచ్చింది.

More Related Stories