అభిజిత్ కి సపోర్ట్ గా విజయ్ దేవరకొండ..గెలుపు ఖాయం

తెలుగు బిగ్ బాస్4 హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నది ఎవరికంటే అభిజిత్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ విజేత అతడే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. ఇక ఇప్పటికే అభిజిత్‌కి నాగబాబు హీరో శ్రీకాంత్ వంటి వారు మద్దతివ్వగా తాజాగా ఈ జాబితాలోకి హీరో విజయ్ దేవరకొండ వచ్చి చేరడం విశేషమనే చెప్పాలి. అభిజిత్‌కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేశారు విజయ్ దేవరకొండ. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా అభిజిత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇదే సినిమాలో విజయ్ దేవరకొండ గోల్డ్ ఫేజ్ కుర్రాడి పాత్రలో మెప్పించారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టీంతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ‘‘మై బాయ్స్.. ఎల్లప్పుడూ వారికి శుభాకాంక్షలు.. ఎక్కడైనా.. ఏదైనా’’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండతో పాటు అభిజిత్, సుధాకర్, అభితో పాటు మరోకరు ఉన్నారు.