English   

మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Master
2020-12-16 13:41:10

దళపతి విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మాస్టర్". ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. సాధారణంగా విజయ్ ఒక్కడు ఉంటేనే సినిమాకు మాములు క్రేజ్ ఉండదు..అలాంటిది సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఉంటే..క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తమిళ టీజర్ అత్యధిక వ్యూస్ తో రికార్డులు బ్రేక్ చేస్తోంది. 

ట్విట్టర్  ట్రెండింగ్ లో కూడా మాస్టర్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో ధింపుతున్నట్టు టాక్ నడుస్తోంది. అంతే కాకుండా సినిమాను తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేయనున్నారని కూడా కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కాగా ఆ వార్తలు నియాజమనేలా చిత్ర యూనిట్ తెలుగు టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈనెల 17న సాయంత్రం 6గంటలకు తెలుగు టీజర్ ను విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. తెలుగులో కూడా మాస్టర్ టీజర్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

More Related Stories