English   

టాలీవుడ్ కోసం దిల్ రాజు గ్రాండ్ గా పెళ్లి దావత్

Dil Raju
2020-12-16 15:26:50

ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాక్ డౌన్ సమయంలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యం కారణంగా మరణించడంతో కొంత కాలం ఒంటరిగా గడిపిన ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ లోని ఓ గుడిలో దిల్ రాజు ఎయిర్ హోస్టెస్ తేజశ్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితులు..కుటుంబీకుల మధ్యలో ఆయన వివాహం జరిగింది. దాంతో టాలీవుడ్ కోసం లావిష్ పార్టీ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 18న దిల్ రాజు పుట్టినరోజు అంతే కాకుండా 50వ పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నట్టు సమాచారం. 

ఈ పార్టీలో దిల్ రాజు తన భార్యను అందరికి పరిచయం చేయబోతున్నట్టు తెలుతోంది. టాలీవుడ్ పెద్దలకు , దిల్ రాజు సన్నిహితులకు ఆహ్వానం అందబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దిల్ రాజు భార్య తేజశ్విని త్వరలో రచయితగా కూడా మరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తేజశ్విని చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో దానిని కొంతమంది రచయితలతో దిల్ రాజు డెవలప్ చేయిస్తున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం ఆరు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories