రెండో పెళ్లి చేసుకుంటున్న రాఘవేంద్రరావు మాజీ కోడలు

రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ కోవెల మూడి మాజీ భార్య కనికా ధిల్లాన్ రెండో పెళ్ళికి సిద్ధమవడం హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లాడిన కనిక మధ్యలో వచ్చిన మనస్పర్ధల వలన ఇరువురు విడాకులు తీసుకుని చట్టబద్ధంగా విడిపోయారు. దీంతో కనికా మరో రచయిత హిమాన్షు శర్మని రీసెంట్గా నిశ్చితార్ధం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలను కనికా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్స్తో పాటు పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'జడ్జిమెంటల్ హై క్యా', 'మన్మర్జియాన్' సినిమాలకు రచయితగా పని చేసింది కనికా. జడ్జిమెంటల్ హై క్యా' చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహించగా, కనికా కథని అందించడం విశేషం. ఇక ఇప్పుడు కనికా చేసుకుబోయే భర్త హిమాన్షు .. తను 'వెడ్స్ మను', 'రాణీజానా', 'జీరో' చిత్రాలకు కథ అందించారు.