English   

ఆది పినిశెట్టి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ క్లాప్ షూటింగ్ పూర్తి

Aadhi Pinisetty
2020-12-17 10:34:58

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంట‌గా శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'క్లాప్‌'. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌యార‌వుతున్న 'క్లాప్'‌ షూటింగ్ పూర్త‌యింది. లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌ల‌ చెన్నైలో షూటింగ్ పున‌రుద్ధ‌రించి పూర్తి చేశారు. 65 వ‌ర్కింగ్ డేస్‌లో చిత్ర బృందం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. దీనికి సంబంధించి యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. చివ‌రి రోజు చివ‌రి సీన్ చిత్రీక‌రించాక‌, హీరో ఆది పినిశెట్టి, డైరెక్ట‌ర్ పృథివి ఆదిత్య స‌హా యూనిట్ మెంబ‌ర్స్ ఒక‌రినొక‌రు కౌగ‌లించుకొని సెల‌బ్రేట్ చేసుకున్నారు. తాము ఊహించిన దానికి మించి స‌న్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయనీ, చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో చిత్రీక‌రించిన స్పోర్ట్స్ బేస్డ్ సీన్లు హైలైట్ అవుతాయ‌నీ నిర్మాత‌లు తెలిపారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు.

More Related Stories