English   

మేజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

Adivi Seshs Major first look
2020-12-17 11:25:35

క్ష‌ణం, గూఢచారి వంటి సినిమాల్లో త‌నదైన న‌ట‌న‌తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అడివి శేష్  లేటెస్ట్ మూవీ ''మేజర్''. ఈ సినిమా  ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా 'మేజర్' ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. శేష్ కి బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్.. 'మేజర్' తన బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని ట్వీట్ చేసాడు.  

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌. 

పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ మూవీకి  శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా  తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల,  బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

More Related Stories