English   

బాలయ్య నెక్స్ట్ మూవీలో నాగశౌర్య 

 Balakrishna
2020-12-17 16:54:03

నటసింహా నందమూరి బాలకృష్ణతో ఒక మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి నాగశౌర్య అంగీకరించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కన్నడ దర్శకుడు శ్రీమన్ వేముల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. అయితే, ఈ సినిమాలో నాగశౌర్య మూగ, చెవిటి కుర్రాడిగా కనిపించనున్నారని టాక్. నాగశౌర్య పాత్రను చాలా ఫన్నీగా డిజైన్ చేశారట దర్శకుడు. అందుకే, ఆ క్యారెక్టర్ నాగశౌర్యకు బాగా నచ్చేసిందని అంటున్నారు.ఈ చిత్రంలో బాలకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2021లో ఈ చిత్రం పట్టాలెక్కుతుందని వినికిడి. ఇదిలా ఉంటే, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

More Related Stories