English   

దళపతి విజయ్ మాస్టర్ తెలుగు టీజర్‌ టాక్ 

Thalapathy Vijay Master
2020-12-17 18:44:08

దళపతి విజయ్ మాస్టర్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. స్టైలిష్ కాలేజ్ పొలిటికల్ డ్రామాగా మాస్టర్ వస్తుంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.విజయ్, విజయ్ సేతుపతి మధ్య సాగే సన్నివేశాలు టీజర్‌లో హైలైట్. లోకల్ గూండా పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. మరోవైపు విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తున్నాడు. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ హైలైట్. తెలుగులో కూడా ఈ సినిమా 11 కోట్లకు అమ్ముడైంది. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే మాస్టర్ విడుదల కానుంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఇప్పటికే వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్.. మాస్టర్ సినిమాతో మరిన్ని రికార్డులు తిరగరాస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ఇప్పుడు వాళ్ల అంచనాలు రెండింతలు చేసేలా టీజర్ విడుదలైంది. 

More Related Stories