దిల్ రాజు బర్త్‌డే పార్టీలో సందడి చేసిన టాలీవుడ్ టాప్ స్టార్స్

Dil Raju Birthday Party..టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు డిసెంబర్ 18న 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గత రాత్రి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఈయన బర్త్ డే పార్టీలో సందడి చేసారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీకి దిల్ రాజు భార్య తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ ఏడాది మేలో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భార్య తేజస్వినిని ఇండస్ట్రీ మిత్రులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ఈ వేడుక ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, రాకింగ్‌స్టార్ యష్, ప్రశాంత్ నీల్, అక్కినేని నాగ చైతన్య – సమంత, అఖిల్, నితిన్ – శాలిని, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ పోతినేని, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు హాజరై దిల్ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.