English   

సమాజ సేవలోకి నిర్మాత దిల్ రాజు

Producer Dil Raju
2020-12-18 12:57:40

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు. ఇటీవల రెండో వివాహం చేసుకుని జీవితంలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. అయితే నేటితో దిల్ రాజు 50 ఏళ్ళ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను ప్రొఫెషనల్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ సామాజిక సేవలో భాగస్వామి అవుతున్నట్లు ప్రకటించారు. సినిమా పరిశ్రమలోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలైంది. యాబై ఏళ్లలో పాతికేళ్లు సినిమాలతోనే అనుబంధ కొనసాగింది. ఎన్నో సక్సెస్‌లు సాధించి నిర్మాతగా ఎదిగా. ఈ క్రమంలోనే పేరు, డబ్బు వస్తుంటాయి. ఈ మధ్యే సెకండ్ లైఫ్‌ స్టార్ట్ చేశా. ఈ కొత్త లైఫ్‌లో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే.. సమాజానికి ఏదైనా తిరిగివ్వాలన్న ఆలోచన వచ్చింది.దాని నుంచే సోషల్‌ సర్వీస్ ప్రారంభిస్తున్నాను. దీనిపై ఆసక్తి ఉన్నవారెవరైనా మాతో జాయిన్ కావొచ్చు. మీడియా వాళ్ల దృష్టికి చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిలో నిజమైనవి గుర్తించి తెలియజేస్తే నా వంతుగా వారికి సాయపడతా''అని దిల్ రాజు తెలిపారు. 

More Related Stories