English   

ఐదోసారి ప్రేమలో పడ్డ వనితా విజయ్ కుమార్

Vanitha Vijaya kumar
2020-12-18 14:01:19

లాక్ డౌన్ కాలంలో నటి వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్లి కూడా మూనాళ్ళ ముచ్చటగానే మారింది. వనిత ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకోగా అతడు భయంకరమైన తాగుబోతు అన్న విషయం భయటపడింది. దాంతో పీటర్ కు తనకంటే మద్యం పైనే ఎక్కువ ప్రేమ ఉందని వనిత అతడిని విడిచిపెట్టింది. కాగా తాజాగా మరోసారి వనిత సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. "నేను మళ్లీ ప్రేమలో పడ్డా..ఇప్పుడు మీరు హ్యాపీనే కదా." అంటూ పోస్ట్ చేసింది. 

దాంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది. నెటిజన్లు వనిత ట్వీట్ పై అనేక రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా వనిత విజయ్ కుమార్ ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్..అంజలి ల కుమార్తె. మొదట నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుని 2007 లో అతడితో విడిపోయింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆకాష్ తో విడిపోయిన తరువాత బిజినెస్ మ్యాన్ జయరాజన్ ను పెల్లడింది. 2012 లో మళ్ళీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తరవాత ఓ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి రిలేషన్ షిప్ లో ఉంది. కానీ అతడిని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈసారి వనిత ప్రేమ కథ ఎలా ఎండ్ అవుతుందో చూడాలి.

More Related Stories