English   

సాయి ధరమ్ తేజ్..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు..

Sai Dharam Tej
2020-12-18 16:55:15

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చాడు. ఇక ఈ హీరో చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది విజయవాడలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ వారు తమను ఆదుకోవాలని.. ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఆర్ధిక సాయం చేయాలని పలువురు సినీ ప్రముఖులను ట్విట్టర్ వేదికగా కోరారు. వారిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సాయి ధరమ్ తేజ్ ”తాను ఆదుకుంటానని.. అండగా నిలుస్తానని” హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే సంవత్సరం కల్లా అమ్మ ప్రేమ ఆదరణ సేవా వృద్ధాశ్రమం రెండు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. తాజాగా ఆ బిల్డింగ్ తేజ్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఏ దిక్కూ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించిన సాయి ధరమ్ తేజ్‌కు ఓల్డేజ్ హోమ్ వారు, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు.

More Related Stories