వివాహ భోజనంబు టీజర్ టాక్.. నవ్వకుండా ఉండలేరు...

హీరో సందీప్ కిషన్ తన బ్యానర్లో 'వివాహ భోజనంబు' అనే టైటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో ఎవరో గెస్ చేయండి అంటూ.. సినిమాపై క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ చిత్ర హీరోని పరిచయం చేయడమే కాదు..టీజర్‌ను కూడా వదిలారు.టాలీవుడ్ ఫస్ట్ లాక్డౌన్ వెడ్డింగ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పిసినారి మహేష్ పెళ్లి చేసుకోగానే లాక్డౌన్ ప్రకటించడం, బంధువులతో నిండిపోయిన ఇంట్లో కొత్త జంటకు ప్రైవసీ దొరక్క ఇబ్బంది పడడం వంటి అంశాలు హైలెట్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. టీజర్ చివర్లో సందీప్ కిషన్ నెల్లూరు ప్రభగా కనిపించి ట్విస్ట్ ఇచ్చారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో.. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందతున్న ‘వివాహ భోజనంబు’ చిత్రానికి సందీప్, శినీష్ నిర్మాతలు. రామ్ అబ్బరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.