గోవాలో దిల్‌రాజు సెలబ్రేషన్స్

దిల్‌రాజు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీని ఇచ్చాడు. ఈ పార్టీకి దాదాపు ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ వచ్చారు. అయితే హైదరాబాద్‌లో పార్టీని పూర్తి చేసుకున్న దిల్‌రాజు భార్యతో కలిసి గోవా చేరుకున్నాడట. అక్కడే ఇక సెలెబ్రేషన్స్ ఊపందుకోనున్నాయి.నిన్నటి పార్టీతో మూవీ ఇండస్ట్రీలో దిల్ రాజు పవర్ ఏంటో తెలిసింది. దిల్ రాజు ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో `వకీల్‌సాబ్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో జరుగుతోంది. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ 25 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. అపజయాల కంటే విజయాల్నే అత్యధికంగా సొంతం చేసుకున్న ఆయన ఇండస్ట్రీలో చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.