English   

బిగ్ బాస్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన పునర్నవి

 Punarnavi
2020-12-19 13:03:27

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటి పునర్నవి భూపాలం. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్ గా నటించగా..పునర్నవి హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అయితే హీరోయిన్ కంటే హీరోయిన్ ఫ్రెండే బాగుందని కామెంట్లు వినిపించాయి. ఆ తరవాత కొన్ని సినిమాల్లో మంచి పాత్రల్లోనే నటించగా..చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక సినిమాల కంటే బిగ్ బాస్ సీజన్-3 లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత పునర్నవి పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ లో రాహుల్ సిప్లింగజ్ తో లవ్ ట్రాక్ నడపడం తో పునర్నవి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బిగ్ బాస్ అభిమానులు ఈ అమ్మడిని పన్ను అంటూ ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు.

ఇక బిగ్ బాస్ తో కొంత పాపులారిటీ సంపాదించుకున్నప్పటికి పునర్నవి మాత్రం ఆ షో పై సంచలన కామెంట్లు చేస్తుంది. తాజాగా బిగ్ బాస్ లో పాల్గొనడం తన కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదని పేర్కొంది. షోకు వెళ్లడం ద్వారా కొత్త అవకాశాలు ఏమీ రాలేదని చెప్పుకొచ్చింది. కానీ షోతో జరిగిన ఒకే ఒక్క మంచి ఏంటంటే నా అభిమానులకు మరింతాబ్దగ్గర కావడం అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు పునర్నవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో గుర్తింపు తెచ్చి పెట్టిన షోపై ఇలా కామెంట్స్ చేయడం సరికాదంటూ నెటిజన్లు చురకలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పునర్నవి కమిట్మెంటల్ అంటే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆహా యాప్ లో అలరిస్తుంది.

More Related Stories