English   

సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ టాక్

Solo Brathuke So Better
2020-12-19 15:02:42

సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో తన గురించి తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాలంటూ చెబుతూ.. జీవించడానికి మనకు బోలెడు హక్కులు ఉంటే, ప్రేమ పెళ్లి అని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామని అంటాడు. అలా పెళ్లికి దూరంగా ఉండే మన హీరో సడెన్‌గా హీరోయిన్‌(నభా నటేష్‌) ప్రేమలో పడి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చివర్లో ఆర్‌ నారాయణమూర్తి చెప్పిన పెళ్లి చేసుకోవాలన్న డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి  సినిమాలో వినోదమంతా తేజ్‌ క్యారెక్టర్‌ చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రాజేంద్రప్రసాద్ - సీనియర్ నరేష్ - రావు రమేష్ - వెన్నెల కిషోర్ - సత్య కీలక పాత్రలు పోషించారు. దీనికి వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. థమన్ సంగీతం సమకూర్చాడు. మొత్తం మీద సోలో లైఫ్ సో బెటర్ అంటూ వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

More Related Stories