English   

బిగ్ బాస్ తెలుగు దివికి మెగాస్టార్ సినిమా ఛాన్స్

 Chiranjeevi
2020-12-21 12:50:03

బిగ్ బాస్ తెలుగు సీజన్-4 గ్రాండ్ ఫినాలే నిన్న రసవత్తరంగా సాగింది. విన్నర్ ఎవరవుతారో అని అటు హౌస్మేట్స్ ఇటు ప్రేక్షకులు నరాలు తెగిపోయే ఉత్కంఠత మధ్య ఎదురు చూశారు. గ్రాండ్  ఫినాలేను నిర్వాహకులు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. షోలో ఎంటర్ టైన్మెంట్ జోష్ పెంచడానికి టాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రణీత, లక్ష్మీ రాయ్, మెహ్రీన్ లు వచ్చారు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కంటెస్టెంట్స్ తో కాసేపు సరదాగా మాట్లాడారు. అనిల్ రావిపూడి క్రమం తప్పకుండా బిగ్ బాస్ ఫాలో అవుతారని షో గురించి ఆయనను ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తారని నాగ్ అన్నారు. ఇక  షోలో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ మరియు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ స్టెప్పులు వేసి జోష్ పెంచారు.

గ్రాండ్ ఫైనాలేకు ఈ సారి కూడా మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. కాగా చిరు ఇంటిసభ్యులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాడు. దివి ని చూసి మెగాస్టార్ చాలా అందంగా ఉన్నావని చెప్పి తన సినిమా వేదాలం రీమేక్ లో ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. సినిమాలో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దివికి అవకాశం ఇస్తున్నామని అన్నారు. అంతే కాకుండా సోహెల్ సినిమాకు సపోర్ట్ చేస్తానని అన్నారు. మరోవైపు మెహబూబ్ ఇంటి నిర్మాణం కోసం ఏకంగా రూ.10లక్షల చెక్ ను మెగాస్టార్ అందజేశారు. తన మిత్రుడు నాగార్జున అంటే ఎంతో ఇష్టమని అతడి కోరిక మేరకు బిగ్ బాస్ కి మరోసారి గెస్ట్ గా వచ్చానని పేర్కొన్నారు.

More Related Stories