English   

రామ్ ఇంట్లో యంగ్ డైరెక్టర్స్ సందడి

Ram Pothineni
2020-12-21 13:27:02

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్  పోతినేని ఇంట్లో యంగ్ డైరెక్టర్లు సందడి చేశారు. రామ్ ఇంట్లో తాజాగా ఓ చిన్న పార్టీ జరగ్గా ఆ పార్టీకి వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఓ ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఫొటోలో రామ్ తో  డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారంటే..కిషోర్ తిరుమల, వెంకీ కుడుముల, గోపి చంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి లు ఉన్నారు. కాగా  సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రామ్ రెండు సినిమాల్లో నటించగా గోపిచంద్ రామ్ తో ఒక సినిమా తీసాడు. ఇక రామ్ నటించిన మూడు సినిమాలకు అనిల్ రావి పూడి రచయితగా పనిచేశాడు.

ఇక వెంకీ కుడుముల తో రామ్ కి మంచి ఫ్రెండ్షిఫ్ ఉంది. ప్రస్తుతం ఈ యుంగ్ డైరెక్టర్స్ తో రామ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా రామ్ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన "రెడ్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పలు ఓటీటీ సంస్థలు సినిమాను దక్కించుకోడానికి ప్రయత్నించినప్పటికీ థియేటర్ లొనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను రామ్ రీచ్ అవుతాడా లేదా చూడాలి.

More Related Stories