English   

అఫీషియల్ ..పవన్ రానా మల్టీస్టారర్

Pawan Kalyan
2020-12-21 14:59:55

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమా రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన "అయ్యప్ప నుమ్ కొషియం" అనే సినిమా రీమేక్ లో పవన్ నటించబోతున్నాడు. ఈ సినిమాను సాగర్ నరేంద్ర డైరెక్ట్ చేయబోతున్నాడు. సినిమా కోసం పవన్ కళ్యాణ్ 40 రోజుకు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రానా కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

మలయాళం లో పృద్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నట్టు సమాచారం. సినిమాలో రానా పాత్ర కీలకంగా ఉంటుందట. దాంతో స్క్రిప్టు బాగా నచ్చి సినిమాకు వెంటనే రానా ఒకే చెప్పేసాడట. ఇక రానాకు జోడిగా నివేదా నటించనుందట. ఈ సినిమాను నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఎస్ఎస్ థమన్ స్వరాలను అందిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో పవన్ సరసన నటించే ఛాన్స్ సాయి పల్లవి కొట్టేసింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హిందీ సినిమా పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగా ఆ వెంటనే మలయాళ రీమేక్ లో నటించనున్నాడు పవన్. అనంతరం క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు.

More Related Stories