English   

నాగచైతన్య థాంక్యూ షూటింగ్ ప్రారంభం

 Naga Chaitanya
2020-12-21 16:04:50

అక్కినేని నాగచైతన్య ప్రధానంపాత్రలో విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా "థాంక్యూ". ఈ సినిమా పూజా కార్యక్రమాలు దసరా సంధర్భంగా నిర్వహించారు. కాగా ఈ సినిమా షూటింగ్ ను ఈరోజు ప్రారంభించారు. సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈరోజు ఉదయం షూటింగ్ ను ప్రారంభించిన విషయాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సంధర్భంగా దర్శకుడు విక్రమ్ ఫోటోను పోస్ట్ చేసింది. ఫొటోలో విక్రమ్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు బివిఎస్ రవి స్క్రిప్టును అందించారు. 

అంతే కాకుండా ఆయనే ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నారు. "థాంక్యూ" సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో "లవ్ స్టొరీ" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. దాంతో ఎక్కువశాతం లవ్ స్టొరీ షూట్ ను తెలంగాణ లోని ఆర్మూర్ లో చిత్రీకరించారు.

More Related Stories