English   

శ్యామ్ సింగరాయ్ రెగ్యులర్ షూటింగ్ షురూ

Nani
2020-12-21 17:32:14

నాచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా నాని ప్రధాన పాత్రలో వస్తున్న "శ్యామ్ సింగరాయ్" సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించారు. ఈరోజే శ్యామ్ సింగరాయ్ షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్ని నాని తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమాలో క్రితి శెట్టి, సాయి పల్లవి నానితో రొమాన్స్ చేయనున్నారు. మూడో హీరోయిన్ కూడా ఛాన్స్ ఉండటంతో ఆ పాత్ర కోసం మడోన సెబాస్టియన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక శ్యామ్ సింగరాయ్ ను దాదాపు రూ.40కోట్ల బడ్జెట్ తో చిత్రించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అంతే కాకుండా సినిమా టైటిల్ కూడా డిఫరెంట్ గా అనిపించడంతో నాని ఈసారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

More Related Stories