English   

అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది..సీనియర్ నటి అన్నపూర్ణ సంచలనం

Annapurna
2020-12-22 10:09:37

సినీ ఇండస్ట్రీలో ఆఫర్లు ఇవ్వాలంటే కోరికలు తీర్చాల్సిందేనని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమాలు చేపట్టారు. మరి కొందరు హీరోయిన్ లు కూడా ఆఫర్లు ఉన్నప్పుడు దీనిపై ఎప్పుడూ స్పందించలేదు కానీ అవకాశాలు కరువయ్యాక  క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా సార్లు క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ తాజాగా సీనియర్ నటీమణులు కూడా క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలితో జాలిగా షోలో వచ్చిన సీనియర్ నటీమణులు  అన్నపూర్ణ, వై.విజయ అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులపై మాట్లాడారు. 

అప్పట్లో కూడా అవకాశాల పేరుతో వేదించేవాళ్ళు ఉండేవారని అన్నారు. అలాంటి వేధింపులు తనకు కూడా ఎదురయ్యాయని అన్నపూర్ణ పేర్కొన్నారు. అవకాశాల పేరుతో వెంటపడే పోకిరులు ఉండేవాళ్ళని చెప్పారు. కానీ అప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లాంటి పేర్లు ఏమీ లేవని అన్నారు. అందుకే అప్పట్లో 20ఏళ్లకే పెళ్లిళ్లు చేసుకుని తల్లి పాత్రలో నటించేవాళ్ళమని చెప్పారు. విజయ మాట్లాడుతూ..అలాంటివాళ్ళు అప్పుడు ఉన్నారు. ఇప్ప్పుడు ఉన్నారు మనమే జాగ్రత్తగా వాళ్ళ నుండి తప్పించుకోవాలని చెప్పారు. ఇక ఈ సీనియర్ నటీమణుల మాటలు వింటుంటే దశాబ్దాల క్రితమే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండేదని స్పష్టంగా అర్థమవుతోంది.

More Related Stories