English   

ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన సింగర్ సునీత రామ్ వీరపనేని

singer sunitha
2020-12-22 10:30:28

టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపదృష్ట త్వరలోనే మరోసారి పెళ్లి పీటలెక్కబోతుంది. కొన్ని రోజుల కింద మీడియా పర్సన్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకుంది ఈమె. తాజాగా ఈ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో సునీత, రామ్ వీరపనేని ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. డిసెంబర్ 19 రాత్రి జరిగిన ఈ పార్టీకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఈ పార్టీలో అటు రామ్, ఇటు సునీత తరఫు మిత్రులు, సన్నిహితులు చాలా మంది హాజరయ్యారు. ఈ పార్టీ కొన్ని గంటల పాటు అద్భుతంగా జరిగిందని తెలుస్తుంది. డిసెంబర్ 26న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రామ్, సునీత పెళ్లి జరగనుంది. వారం రోజుల ముందుగానే ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేసారు ఈ జంట.

More Related Stories