English   

పవన్ రానా సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Rana Daggubati
2020-12-22 11:49:47

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా  మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కొషియం" అనే సినిమా రీమేక్ లో  నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సాగర్ నరేంద్ర డైరెక్ట్ చేయబోతున్నాడు. సినిమాలో పవన్ సరసన నటించే ఛాన్స్ సాయి పల్లవి కొట్టేసింది. ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మలయాళం లో పృద్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నట్టు సమాచారం.  ఈ చిత్రంలో రానా పాత్ర కీలకంగా ఉంటుందట. రానాకు జోడిగా నివేదా నటించనుంది. ఈ సినిమాకు నిన్న పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

ఇక సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ స్వరాలను అందిస్తున్నారు.  ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబందించి ఆసక్తికరమైన టైటిల్స్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు "బిల్లా రంగ "అనే ఆసక్తికరమైన టిటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సినిమా స్టోరీకి తగినట్టు టైటిల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో బిల్లాగా పవన్ కళ్యాణ్...రంగా గా రానా నటిస్తున్నారట. కాగా 1982లో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో "బిల్లా రంగ" అనే టైటిల్ తో వచ్చిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరి పవన్ కళ్యాణ్, రానాలు కూడా అలాంటి హిట్ కొడతారా అనేది చూడాలి.

More Related Stories