English   

కాజ‌ల్ అగ‌ర్వాల్ దంప‌తుల కొత్త వ్యాపారం.. కిచ్డ్ హోమ్ డెకార్

 Kajal Gautham
2020-12-22 12:22:10

బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్న కాజల్ నెలన్నర రోజులకే ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా మారిపోయింది. స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.ముంబ‌యిలో మంచి ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా గుర్తింపు పొందిన గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కాజ‌ల్‌ ఇప్పుడు ప్ర‌త్యేక బ్రాండ్‌ని ప్రారంభించారు. కిచ్డ్ పేరిట ఓ హోమ్ డెకార్ బ్రాండ్‌ని వీరు స్టార్ట్ చేశారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ''గౌతమ్ నేను కలిసి మీ కోసం 'కిచ్డ్' అనే హోమ్ డెకార్ లేబుల్ ని తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టింది. ముందుగా ఫెస్టివ్ థీమ్ తో చేతితో తయారు చేయబడిన కుషన్ లను మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ అందరికి నచ్చేవిధంగా మీ ఇంటి అందాన్ని పెంచేలా మీరు సంతృప్తి చెందేలా ప్రోడక్ట్ లను ఇవ్వడమే మా బ్రాండ్ ఉద్దేశ్యం. మాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. ప్రస్తుతం లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉన్నందున నిరూత్సాహ పడకుండా ఉండేందుకు మీరు  ఇప్పుడే షాపింగ్ మొదలుపెట్టండి. మా బ్రాండ్ నుంచి వస్తోన్న మొదటి ప్రోడక్ట్ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాము'' అని కాజల్ పోస్ట్ చేసింది. 

More Related Stories