English   

సంక్రాంతికి రాబోతున్న బంగారు బుల్లోడు

Allari Naresh
2020-12-22 12:59:50

టాలీవుడ్ లో కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. అల్లరి సినిమాతో ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన నరేష్ కు మొదటి సినిమానే ఇంటిపేరుగా మారిపోయింది. ఆ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. కొన్ని సార్లు నరేష్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు సైతం పోటీ ఇచ్చాయంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతకాలంగా నరేష్ కు సరైన హిట్ లేదు. ఇక ఇటీవల మహేష్ బాబు "మహర్షి" సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించడంతో మళ్ళీ ప్రేక్షకులను అలరించాడు.

దాంతో మళ్ళీ వరుస పెట్టి  సినిమాలు చేస్తున్నాడు. అందులో "బంగారు బుల్లోడు" సినిమా కూడా ఒకటి. "నందిని నర్సింగ్" హోమ్ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన పీవీ జిగి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికి కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. దాంతో జనవరిలో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో విడుదల చేయనుంది. ఇక ఈ సినిమాలో నరేష్ సరసన పూజ  జవేరి హీరోయిన్ గా నటిస్తుంది. చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక చాలా కాలం గ్యాప్ తరవాత వస్తున్న అల్లరి బుల్లోడు ఏ మేరకు నవ్విస్తాడో చూడాలి.

More Related Stories