English   

కీర్తి మేలుకుందట..ఇక ఆ సినిమాలకు గుడ్ బై

Keerthy Suresh
2020-12-22 14:34:45

కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన "మహానటి" సినిమా సూపర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి. దాంతో కీర్తిసురేష్ రూటు మార్చుకుంది.  ఎక్కువగా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో మాత్రమే నటించడం మొదలుపెట్టింది. అయితే కీర్తి అనుకున్నట్టుగా సినిమాలు హిట్ అవ్వకపోగా వరుసగా బోల్తాపడుతున్నాయి. దాంతో మహానటి హిట్ తరవాత కీర్తి ఆలోచించకుండా లేడీ ఓరియెంటెడ్ కథలకు ఒకే చెబుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 

మహానటి తరవాత కీర్తి నటించిన పెంగ్విన్ సినిమా ఓటీటీ లో విడుదలైంది. కాగా సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దాని తరవాత వచ్చిన మరోసినిమా "మిస్ ఇండియా". అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా కూడా తుస్సుమంది. దాంతో కీర్తి సురేష్ ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యిందట. ఆచి తూచి కథలని ఎంపిక చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా "గుడ్ లక్ సఖి" ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సినిమాలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అయినా కీర్తికి హిట్ తెచ్చిపెడుతుందో చూడాలి.

More Related Stories