షాకింగ్..రకుల్ ప్రీత్ సింగ్ కి కరోనా పాజిటివ్

2020-12-22 14:48:55
కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్ సింగ్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. సడన్ గా ఈ భామకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం రకుల్ పాల్గొంటున్న సినిమా షూటింగ్ లు అపినట్టు సమాచారం. `నేను టెస్ట్ చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే నాకు నేను హోం క్వారంటైన్ అయిపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. రెస్ట్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని బయటకు వచ్చి షూటింగ్లో పాల్గొంటాను. ఇటీవల కాలంలో నన్ను కలిసి వారంతా దయజేసి టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా. అందరు జాగ్రత్తగా ఉండండి`అని ట్వీట్ చేసింది.