English   

విజే చిత్ర కేసులో మరో ట్విస్ట్..రాజకీయ నాయకుడుతో సంబంధాలు

 Chithra
2020-12-22 16:40:14

సీరియల్ నటి, యాంకర్ విజే చిత్ర ఈనెల 9న హోటల్ గదిలో  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చిత్రది ఆత్మహత్య అని డాక్టర్లు వెల్లడించారు. ఈ కేసులో చిత్ర భర్తపై ఆరోపణలు రావడంతో విచారించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. ఇక ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయట పడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి హేమానాథ్ తండ్రి, చిత్ర మామ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు ఓ పిటిషన్ ను సమర్పించారు. ఆ పిటిషన్ లో తన కుమారుడు నిందితుడు కాదని పేర్కొన్నాడు. శృంగార భరితమైన సీరియల్స్ లో నటించవద్దని వేధించడం చేయలేదాని తెలిపాడు. అంతేకాకుండా చిత్రకు ఓ రాజకీయ నాయకుడు తో సంబంధాలు ఉన్నాయని అతడు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతాడని వెల్లడించాడు. మరోవైపు ఓ యాంకర్ ఆమెను వేధింపులకు గురిచేసాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని దానిపైన కూడా విచారణ జరపాలని అన్నారు.

More Related Stories