English   

సోహెల్ కు బ్రహ్మానందం బంపరాఫర్.. ఫ్రీగా చేస్తా

Sohel
2020-12-23 00:44:39

వందరోజులు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ తెలుగు సీజన్-4 కు ఆదివారం శుభం కార్డు పడింది. గ్రాండ్ ఫైనాలేకు బిగ్ బాస్ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్ కు కూడా మెగాస్టార్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. కాగా ఈసారి  టాప్ 3 లో ముగ్గురు కాంటెస్టెంట్స్ ఉండగా వారిలో అభిజిత్ విన్నర్ గా నిలిచి అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. కానీ వీరిద్దరికంటే ఎక్కువ బెనిఫిట్స్ సోహెల్ పొందాడు. బిగ్ బాస్ ఇచ్చిన 25 లక్షల ఆఫర్ ను సోహెల్ తీసుకుని సేఫ్ జోన్ లో పడ్డాడు. సోహెల్ ఆ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా ఓ చిన్న సినిమా తిస్తానని చెప్పాడు.

దాంతో మెగాస్టార్ నీ సినిమా ప్రమోషన్ కోసం నేను వస్తానని మాటిచ్చారు. అంతటితో ఆగకుండా సోహెల్ కోసం మెగాస్టార్ ఇంటి నుండి బిర్యానీ వండించి మరీ తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సైతం సోహెల్ కు ఫోన్ చేసి సినిమా తీస్తే అందులో ఫ్రీగా నటిస్తానని చెప్పాడట. దాంతో సోహెల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సోహెల్ బిగ్ బాస్ లో పాల్గొని విన్నర్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందాడని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

More Related Stories