English   

ఆ సినిమాలో నా పేరు వాడారు..నారాయణ మూర్తి ఎమోషనల్

R Narayana Murthy
2020-12-23 01:42:20

ఇటీవల విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి పేరును  భాగా వాడేశారు. పెళ్లి చేసుకోవాలని..ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సు లో జరగాలని ఆర్ నారాయణ మూర్తి చెప్పిన డైలాగ్ ను ట్రైలర్ లో వేశారు. కాగా తాజాగా తన పేరును సినిమాలో వాడటం పై ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. ఆయన మాట్లాడుతూ..."చాలా బాగుంది, గొప్పగా ఉంది. హీరో నా ఫ్యాన్ అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సాంస్కృతిక కళాకారుడిగా.. సైనికుడిగా పని చేస్తున్నా అని చాలా మంది నన్ను సినిమాలో చూపిస్తున్నారు. టెంపర్ సినిమాలో పోసాని నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఆ పాత్రకు నా పేరు పెట్టడం ఆనందంగా అనిపించింది. అంతే కాకుండా హైపర్ సినిమాలో సత్యరాజ్ ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటించారు. ఆ పాత్రకు కూడా నా పేరు పెట్టారు. నా పేరు పెడుతున్న దర్శక నిర్మాతలకు నేను రుణపడి ఉంటాను." అంటూ నారాయణ మూర్తి అన్నారు.

More Related Stories