English   

శశి టీజర్ టాక్...ఆకట్టుకునే డైలాగులతో

Sasi Movie Teaser
2020-12-23 12:55:05

ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది. సాయి కుమార్ తనయుడిగా ఎంట్రీనిచ్చినప్పటికి ఆది ఇప్పటికీ ఓ మంచి సక్సెస్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఆది నటించిన చిత్రం "శశి". తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఈ టీజర్ ను లాంచ్ చేశారు. సినిమాలో ఆది కి జోడిగా సురభి నటించింది. ఇక మరో హీరోయిన్ గా రాశీ సింగ్ నటించింది. ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా  పరిచయం అవుతున్నారు. చిత్రాన్ని హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికి లాక్ డౌన్ వల్ల విడుదలకు నోచుకోలేదు.

ఇక నేడు డిసెంబర్ 23 ఆది బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఈ  టీజర్ లో ఆది ఇదివరకు ఎన్నడూ కనిపించని యాంగిల్ లో కనిపించాడు. సినిమాలో ఆది రాక్ స్టార్ గా కనిపించనున్నాడని అర్థమవుతుంది. సినిమాలో యాక్షన్ మరియు రొమాంటిక్ లవ్ స్టొరీ ఉండబోతుందని తెలుస్తోంది. "అమ్మాయి అందంగా ఉందని ప్రేమించకూడదు..కష్టాల్లో ఉందని వదిలెయ్యకూడదు" అంటూ చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. చిత్రంలో చెముడు హర్ష, వెన్నెల కిషోర్ ఉండటంతో కామెడీ కూడా బాగానే పండుతుందనిపిస్తుంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే సినిమాపై అంచాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించారు.

More Related Stories