English   

సోలో బ‌తుకే సో బెట‌రుకు టాలీవుడ్ సపోర్ట్ 

 Tollywood
2020-12-23 15:27:01

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సినిమా సోలో బ‌తుకే సో బెట‌రు క్రిస్మ‌స్‌కి విడుద‌ల అవుతోంది. క‌రోనా భ‌యాల‌తో జ‌నాలు థియేటర్ల‌కు వ‌స్తారో రారో తెలీదు. వ‌చ్చినా 50 % ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు మ‌నుగ‌డ సాగిస్తాయో లేదో తెలీదు. అస‌లు జ‌నాల‌కు సినిమా చూడాల‌న్న మూడ్ ఉందో లేదో తెలీదు. వాట‌న్నింటినీ, కరోనా నియ‌మ నిబంధ‌న‌ల మ‌ధ్య 50 శాతం ఆక్యుపెన్సీ అయినా వ‌స్తే – సూప‌ర్ స‌క్సెస్ అయిన‌ట్టే. త‌ర‌వాత రాబోయే సినిమాల‌కు, రావాల‌నుకుంటున్న సినిమాల‌కు ఈ సినిమా ఓ ఊతంలా ఉప‌యోగ‌ప‌డుతుంది. లెక్క ఏమాత్రం తేడా వ‌చ్చినా – సంక్రాంతి సినిమాలు సైతం ఆగిపోతాయి. అందుకే ఈ సినిమా ఆడాల‌ని చిత్ర‌సీమ మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది. ఈసినిమా ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదు‌రుచూస్తోంది. అందుకే సోలో బతుకు సినిమాకు అండగా నిలవాలని టాలీవుడ్ నిర్ణయించింది. పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా తొలిరోజు, తొలి ఆటకు థియేటర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ ఒకే థియేటర్ కు కాకుండా వివిధ థియేటర్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
 

More Related Stories