English   

రజనీకాంత్ అన్నాతైకు కరోనా ఎఫెక్ట్..ఏడుగురికి పాజిటివ్

Rajinikanth
2020-12-23 16:32:57

రజనీకాంత్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో ‘అన్నాతై’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘అన్నాతై’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. తాజాసమాచారం ప్రకారం రజినీకాంత్ ప్లాన్స్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. కరోనా ప్రోటోకాల్ ప్రకారం రోజువారి టెస్ట్ లో భాగంగా ఈ రోజు అన్నాతై యూనిట్ సభ్యులకి టెస్ట్ లు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్.  ఈ ఘటనతో షాక్ కి గురైన సినిమా యూనిట్ వెంటనే షూట్ ఆపివేసినట్టు సమాచారం.  ప్రస్తుతం రజినీకాంత్ హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళినట్టు సమాచారం.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 

More Related Stories