English   

సోహెల్ కథ వేరే..అప్పుడే సినిమా అనౌన్స్ మెంట్ 

Bigg Boss Sohel
2020-12-24 10:51:54

బిగ్ బాస్ సీజన్-4 కు గత సీజన్ ల కంటే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో గంగవ్వ ఉండటంతో బిగ్ బాస్ ఫ్లేవర్ పల్లెలకు సైతం పాకిపోయింది. దాంతో రేటింగ్ లో దూసుకుపోయింది. ఇక ఇటీవల పూర్తయిన ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలిచారు. అఖిల్ సార్ధక్ రన్నరప్ గా నిలిచారు. కాగా టాప్ 3లో సోహెల్ కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ విన్నర్, రన్నర్ కంటే సోహెల్ కు ఈ సీజన్ ఎక్కువగా కలిసొచ్చింది. 

ఫినాలే లో నాగార్జున ఆఫర్ చేసిన 25 లక్షలను తీసుకుని సోహెల్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. తనకు హీరోగా చిన్న సినిమా చేయాలని ఉందని చెప్పగా మెగాస్టార్ సోహెల్ సినిమా ప్రమోషన్ చేస్తానని మాటిచ్చారు. ఇక తాజాగా సోహెల్ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. జార్జి రెడ్డి సినిమా నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీనివాస్ వింజనపాటి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. మెగాస్టార్ సపోర్ట్ తో వస్తున్న సోహెల్ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

More Related Stories