థ్యాంక్ యు బ్రదర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

2020-12-24 17:37:00
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం థ్యాంక్ యు బ్రదర్ సినిమా మోషన్ పోస్టర్ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ అంతా భయంకరమైన శబ్ధాలతో ఉండగా, నెలలు నిండిన గర్భవతిగా అనసూయ, అశ్విన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని భయంతో చూస్తున్నారు.లిఫ్ట్ మధ్యలో స్ట్రక్ అయినట్టు.. సాయం కోసం అభి అరుస్తున్నట్టు మోషన్ పోస్టర్లో చూపించారు. అనసూయ ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు రివీల్ చేశారు. ఇంతకి లిఫ్ట్ లో అనసూయ ఎందుకు ఇరుక్కుంది. అసలేం జరిగిందనేది తెలియాలంటే ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమా చూడాల్సిందే.