English   

టక్ జగదీష్..జ‌గ‌దీష్ నాయుడుగా నాని 

Tuck Jagadish
2020-12-25 11:19:40

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో వస్తోన్న చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్’. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

నాచుర‌ల్ స్టార్ నాని.. త‌న ‘టక్ జగదీష్’ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  ఇందులో చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చున్న నాని వెనుక నుండి క‌త్తి తీయ‌డం అంద‌రిలో అంచ‌నాలు పెంచుతుంది.  ఇందులో జ‌గ‌దీష్ నాయుడు అనే పాత్ర‌లో నాని క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు.  ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం మంచి ఎమోష‌న్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

More Related Stories