విక్రమ్ కోబ్రా సెకండ్ లుక్..మెదడులో అంకెలు

కోబ్రాలో విక్రమ్ సెకండ్ లుక్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుదల చేసింది. ఆ ఫొటోలో పొడవాటి.. గజిబిజి జట్టుతో కనిపించాడు విక్రమ్. అంతేకాదు ఎన్నో అంకెలు, ఫార్ములాలు అతడి మెదుడులో ఉన్నట్లు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోబ్రా మూవీలో హీరో విక్రమ్ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోబ్రా చిత్రంలో విక్రమ్ హీరోగా, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో పఠాన్ కనిపించనున్నాడు. వీరితో పాటు కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.