రామ్ చరణ్ ఇంట్లో మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబరాలు

2020-12-25 21:41:53
రామ్ చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, చైతన్య, శిరీష్ ,అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్ తదితరులు ఈ పార్టీలో సందడి చేయగా,అందుకు సంబంధించిన ఫొటోని శిరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కజిన్స్‌తో సీక్రెట్ శాంటా ఆడామని అన్నాడు. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మెగా ఫ్యామిలీ అంత ఒకే ఫ్రేమ్‌లో ఉంటూ కనులవిందు చేస్తోంది. ఈ క్రిస్మస్ పార్టీని రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.