English   

సోలో బ్రతుకే సో బెటర్‌ మూవీ షార్ట్ రివ్యూ 

Solo Brathuke So Better
2020-12-25 15:36:51

కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు కొన్ని నెలలపాటు థియేటర్ ఎక్స్పీరియన్స్ కు దూరమయ్యారు. ఇటీవల థియేటర్ లు తెరవడంతో చాలా గ్యాప్ తరవాత క్రిస్మస్ కానుకగా సోలో బతుకే సో బెటర్ సినిమా థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహించారు. చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్  నిర్మించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే... సోలో బ్రతుకే సో బెటర్.. ఈ మాట చెప్పడానికి చాలా అందంగా ఉంటుంది..పాటించడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ మాట అనుకోవడమే కాదు.. ఇలాంటి కథను డీల్ చేయడం కూడా చాలా కష్టం. 

ఏ మాత్రం గాడి తప్పినా బొమ్మ తిరగబడటం ఖాయం..సాయి ధరంతేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా ఇలాగే అనిపించింది నాకు.  అనుకున్న కథను ఆకట్టుకునేలా తెరపై చూపించడంలో కొత్త దర్శకుడు సుబ్బు అంతగా సక్సెస్ కాలేదు. సినిమా మొదలైన తొలి అరగంట వరకు.. తాను నమ్మిన సోలో బ్రతుకే సిద్ధాంతాన్ని అదిరిపోయేలా ప్రజెంట్ చేశాడు..కానీ ఆ తర్వాత అది తప్పు అని చెప్పడంలో ఎక్కడో తడబడినట్టు అనిపించింది..జీవితంలో సోల్ మేట్ లేకపోతే.. సోలో లైఫ్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాడు సుబ్బు..కానీ ఆ కథను కన్విన్సింగ్ గా చెప్పడంలో ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది.. తొలి అరగంట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోయిన కథ..ఆ తర్వాత నెమ్మదిగా బ్రేకులు వేస్తూ ముందుకు వెళ్ళింది. 

రావు రమేష్ లాంటి నటుడిని ఎక్కువగా వాడుకోలేకపోయారు అనిపించింది.. అక్కడక్కడ ఆహా అనిపించే సన్నివేశాలు ఉన్నా.. అబ్బా ఏంటిది అనిపించే సన్నివేశాలు వాటిని డామినేట్ చేశాయి. సాయి ధరమ్ తేజ్ తన పాత్రలో ఒదిగిపోయాడు.. చాలా బాగా నటించాడు. నభ నటేష్ పర్లేదు.. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. 9 నెలల తర్వాత విడుదలైన తొలి తెలుగు సినిమా కావడంతో ఆ ఫీల్ అయితే వచ్చింది. OTT అలవాటు పడ్డ ప్రాణానికి మళ్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది సోలో బ్రతుకే సో బెటర్. సినిమా యావరేజ్ గానే ఉన్నా.. వీకెండ్ ఓసారి వెళ్లి చూసి వచ్చేయొచ్చు. ఓవరాల్ గా సోలో బ్రతుకే సో బెటరూ.. చెప్పినంత ఈజీ కాదు.. తీయడం సులువు కాదు..

More Related Stories