రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర రక్తపోటుకు గురికావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తాజాగా అందుతున్న ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సూపర్ స్టార్ ఆరోగ్యం కొంచెం ఆందోళనకరంగా మారుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ చెన్నై నుంచి వచ్చిన తన పర్సనల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
చెన్నై నుంచి వచ్చిన డాక్టర్లు సీటీ స్కాన్ మరియు గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినట్టు చెబుతున్నారు. అలాగే ఆయన రక్తపోటును అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్ది రజినీకాంత్ ఆరోగ్యం కొంచెం ఆందోళనకరంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు చేసిన టెస్ట్ ల రిపోర్ట్ రాగానే రేపు మరిన్ని టెస్ట్ లు చేయడానికి డాక్టర్లు సిద్ధమవుతున్నారు. మరోవైపు రజినీకాంత్ పరిస్థితి తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. రజనీకాంత్‌కు తోడుగా ఆసుపత్రిలో ఆయన కుమార్తె ఉన్నారు. ఆయన పరామర్శించేందుకు వచ్చిన వారిని ఎవ్వరినీ ఆసుపత్రి వర్గాలు లోపలికి అనుమతించడం లేదు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.