English   

పొలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ క్లారిటీ..ఖచ్చితంగా

Chiranjeevi
2020-12-26 12:11:33

మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ పై ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కథనాలు వస్తున్నాయి. చిరు పవన్ పార్టీలో చేరతారని...ఓ జాతీయ పార్టీ ఆయనకు కీలక పదవి ఇస్తానంటుందని వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆహా లో సమంత చేస్తున్న సామ్ జామ్ లో తన పొలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో సమంత చిరును మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. దానికి మెగాస్టార్ సమాధానం ఇస్తూ... పదేళ్లలో రాకీయాల్లో చాలా తెలుసుకున్నానని అన్నారు. తనకు రాజకీయాలు సెట్ కావని అన్నారు. 

ప్రస్తుతం నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని..మరో జన్మంటూ ఉంటే నటుడిగానే పుట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.  అంతేకాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పై పవన్ స్పందించారు. పవన్ చాలా కష్టపడుతున్నదని అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుందని చెప్పాడు. మరోవైపు ఇతర పార్టీలు కూడా తనను ఆహ్వాఇస్తున్నాయని చిరంజీవి పేర్కొన్నారు. అది కేవలం వారి ఆశ అభిలాష మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించిన మెగాస్టార్ రాజకీయాల్లో కొనసాగలేకపోయారు. దాంతో ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయ్యారు.

More Related Stories