English   

రజినీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల

Rajinikanth
2020-12-26 12:28:52

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా శుక్రవారం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అపోలో ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. హెల్త్ బులిటెన్ లో నిన్నతికంటే రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొన్నారు. ఇవ్వాల ఆయనకు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం వరకు రిపోర్ట్స్ వస్తాయని వాటిని బట్టి  డిశ్చార్జ్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. బీపీ హెచ్చు తగ్గులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. 

ఆయనకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించమన్నారు. ఎవరూ రజినీకాంత్ ను చూడడానికి ఆస్పత్రికి రావద్దని తెలిపారు. ప్రస్తుతం రజినీ కూతురు ఆయన బాగోగులు చూసుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా రజినీకాంత్ అన్నాతే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చారు. కాగా చిత్ర బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో రజనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కానీ ఆయన బీపీ లో హెచ్చు తగ్గుల కారణంగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు అపోలో వైద్యులతో పాటు చెన్నై నుండి వచ్చిన ఆయన పర్సనల్ డాక్టర్ లు చికిత్స అందిస్తున్నారు. రజినీకాంత్ త్వరగా కోలుకుని రావాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. రాజకీయ సినీ ప్రముఖులు రజినీకాంత్ కోలుకోవాలని కోరుకుంటున్నారు.

More Related Stories