బిగ్ బాస్ బ్యూటీకి స్టార్ మా ఆఫర్

గతంలో స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన లేడి కంటెస్టెంట్స్‌కు పలు ఆఫర్స్ ఇచ్చింది. తేజస్విని, శ్రీముఖి వంటి అందాల భామలు కొన్నాళ్లు హల్ చల్ చేశారు. ఇప్పుడు మోనాల్ టైం వచ్చింది. డ్యాన్స్ ప్లస్ అంటూ ఓంకార్ చేయనున్న క్రేజీ కార్యక్రమంలో మోనాల్ హోస్ట్‌గా కనిపించనుందనే టాక్ వినిపిస్తుంది. తాజాగా మోనాల్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఈ కార్యక్రమంలో అమ్మడి పాత్ర ఏంటనే దానిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. మోనాల్ బిగ్ బాస్4 షోకు రాకముందు నాలుగైదు సినిమాలలో నటించినా పెద్ద గుర్తింపు తెచ్చుకోని మోనాల్ బిగ్ రియాలిటీ షోతో అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ భామ ఎక్కువగా తెలుగు..గుజరాతీ చిత్రాల్లో నటించింది. అంతేకాదు తమిళ..మలయాళ..హిందీ మూవీస్ లలో కూడా యాక్ట్ చేసిందీ గుజరాతీ బ్యూటీ. ముఖ్యంగా ఇప్పుడు యూత్ కలల రాణిగా మారిన ఈ అమ్మడిని పలు షోస్‌కు యాంకర్గానో లేదంటే మంచి సినిమాలలో హీరోయిన్‌గానో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.