English   

రామ్ రెడ్ సెన్సార్ పూర్తి..సంక్రాంతికి విడుదల

Ram RED
2020-12-26 18:01:32

రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ హీరోయిన్స్ గా నటించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్నఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఆ సమయం వచ్చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్  ప్రకటించింది. 

నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘’ఈరోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది . 'దేవదాసు', 'మస్కా' తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో... ఈ అంశాలన్నీ సినిమాలోఉంటాయి.'ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, 'రెడ్'కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. అన్ని థియేటర్స్ లోను ట్రైలర్ ప్రదర్శితమవుతూ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది" అని అన్నారు.

More Related Stories