English   

మాల్దీవుల్లో నిశ్చయ్ హనీమూన్

Niharika Chaitanya
2020-12-28 11:00:59

నిహారిక పెళ్లి అయ్యి వారాలు గడుస్తున్నాఈ దంపతులు హనీమూన్ కు వెళ్లక పోవడంతో అంతా కూడా కరోనా భయంతో వీరు హనీమూన్ ను క్యాన్సిల్ చేసుకున్నారేమో అనుకున్నారు. కాని తాజాగా వీరిద్దరు మాల్దీవులకు వెళ్లి పోయారు. అక్కడ వారం రోజుల పాటు గడిపేందుకు కొన్ని గంటల ముందు వారు విమానం ఎక్కేశారు. ఇప్పటికే మాల్దీవుల్లో ల్యాండ్ అయిన నిహరిక అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రటీలు మాల్దీవుల అందాలను చూపించారు. నిహారిక షేర్ చేసిన వీడియోలు మరియు ఫొటోలు మాల్దీవుల అందంను మరింతగా ఎక్కువ చేసి చూపిస్తున్నాయి. ప్రస్తుతం మాల్దీవుల్లో వీరిద్దరు టైం ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వాతావరణం మరియు బీచ్ లు చాలా అద్బుతంగా ఉంటాయి. అందుకే ఈమద్య కాలంలో సెలబ్రెటీలు అంతా కూడా అక్కడకు క్యూ కట్టారు. వారి దారిలోనే నిశ్చయ్ దంపతులు కూడా అక్కడకు వెళ్లారు. నిహారిక పోస్ట్ చేసిన ఫొటోల్లో పలు డ్రెస్ లతో మెరిసిపోయిందీ కొత్త పెళ్ళి కూతురు. అవన్నీ మ్రోడన్ డ్రెస్ లే కావడం విశేషం.

More Related Stories