English   

చెన్నై ఇంటికి రజినీకాంత్ ..వారం రోజులు రెస్ట్ 

Rajinikanth
2020-12-28 11:34:34

హై-బీపీతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ 48 గంటలకు పైగా వైద్యుల పర్యవేక్షణలో ఉండి డిశ్చార్జ్ అయి చెన్నైఇంటికి చేరుకున్నారు. గతంలో రజనీకాంత్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. కాబట్టి హై-రిస్క్ వ్యక్తుల కేటగిరీలో రజనీకాంత్ కూడా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కాబట్టి కరోనా కారణంగా ఎలాంటి కార్యక్రమాల్లో రజనీకాంత్ పాల్గొనకూడదని కూడా హెచ్చరించారు. అపోలో హాస్పిటల్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు.  తన తండ్రి వారం రోజుల పాటు అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటారని రజనీకాంత్ కుమార్తె వెల్లడించారు. అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం 13న హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత యూనిట్ లో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో షూటింగ్ ను అర్థాంతరంగా ఆపేసి, ముందుజాగ్రత్తగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రజనీకాంత్. 
 

More Related Stories