ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ఇంట విషాదం నెలకొంది. ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం ఈ రోజు కన్నుమూశారు. రెహమాన్ యవ్వనంలో ఉన్నప్పుడే అతడి తండ్రి మరణించాడు. ఇప్పుడు తల్లి కూడా మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. కరీమా బేగం మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రెహమాన్ అభిమానులు తమకు మంచి సంగీత దర్శకున్ని అందించినందుకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రెహమాన్ తండ్రి మరణించిన అనంతరం వారసత్వంగా ఆయన సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగిపోతున్నారు. దాదాపు అన్ని భాషా చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగానే కాకుండా రెహమాన్ గాయకుడిగా, రచయితగా కూడా రాణిస్తున్నారు. రెహమాన్ తెలుగులో గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్, ప్రేమ దేశం, సఖి, జీన్స్, రోబో లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించాడు.