English   

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. రెండోసారి మొక్కలు నాటిన దేతడి హారిక

Dethadi Harika
2020-12-28 16:16:49

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపాది.

మిత్రుడు నటుడు నోయెల్ సేన్, బిగ్ బాస్ 2 ఫేం దీప్తి సునైనా లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశామని పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని; వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.  ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్కి హారిక కృతజ్ఞతలు తెలిపారు.
 

More Related Stories